అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి ముందు వాయుగుండంగా ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా ఇప్పుడు తుఫాన్‌గా మారి గుజరాత్ తీరంవైపు దూసుకొస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తీర ప్రాంతాల్లో భారీగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించి సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా పశ్చిమ రైల్వే సైతం తుఫాను నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. మే 17, 18 తేదీల్లో పలు రైలు సర్వీసులను రద్దుచేసింది. పలు రైళ్ల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది.
Due to the cyclone warning in coastal Gujarat region on May 17 & May 18, many trains will be cancelled/short terminated: Western Railway pic.twitter.com/EMxWIfGjVK
— ANI (@ANI) May 15, 2021