న్యూఢిల్లీ, నవంబర్ 1: సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో సింధూ జలాలపై పూర్తిగా ఆధారపడిన సింధూ బేసిన్ తీవ్ర నీటి కొరత ముప్పును ఎదుర్కొంటోందని సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రచురించిన ఓ నివేదిక వెల్లడించింది. ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా పశ్చిమ పాకిస్థాన్ సరిహద్దుల్లోకి సింధూ జలాల ప్రవాహాన్ని భారత్ అడ్డుకోగలిగిందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడిని పురస్కరించుకుని పాకిస్థాన్‌తో గతంలో చేసుకున్న సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. పాకిస్థాన్‌లోని వ్యవసాయ రంగం సింధూ జలాలపై 80 శాతం ఆధారపడిన కారణంగా ఈ పరిణామంతో పాక్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లయింది.