కాన్పూర్ : మద్యం మత్తులో ఓ యువకుడు విలాసవంతమైన కారును ప్రజల పైకి పోనివ్వడంతో కాన్పూర్లో ఆదివారం పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కొడుకు శివమ్ మిశ్రా ప్రముఖులు నివసించే రోడ్డులో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.
‘మిశ్రా సుమారు రూ.10 కోట్లకు విలువైన లంబోర్గి కారును వేగంగా నడపడంతో అది అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పలు వాహనాలు, మనుషులను ఢీ కొట్టింది’ అని డీసీపీ అతుల్ కుమార్ తెలిపారు. మిశ్రాను స్థానికులు కారులోంచి బయటకు లాగి తమ ఆధీనంలో ఉంచుకున్నారు. పోలీసులు వచ్చి నిందితుడిని, క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.