న్యూఢిల్లీ: రైలులోని అప్పర్ బెర్త్‌లో నిద్రించిన జవాన్ మద్యం మత్తులో మూత్ర విసర్జన చేశాడు. (Drunk Soldier Urinates In Train) కింది బెర్త్‌పై నిద్రించిన మహిళపై మూత్రం పడటంతో ఆమె ఫిర్యాదు చేసింది. రైల్వే, ఆర్పీఎఫ్ స్పందించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు ప్రయాణించిన గోండ్వానా ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ సంఘటన జరిగింది. ఒక సైనికుడు బీ 9 కోచ్‌లోని అప్పర్ బెర్త్ 24పై నిద్రించాడు. మద్యం మత్తులో నిద్రలోనే మూత్ర విసర్జన చేశాడు.
కాగా, లోవర్ బెర్త్ 23లో ఏడేళ్ల కుమారుడితో కలిసి నిద్రించిన మహిళపై మూత్రం పడింది. దీంతో తన భర్తకు దీని గురించి ఆమె చెప్పగా రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ స్టేషన్‌కు రైలు చేరగా ఆర్పీఎఫ్ సిబ్బంది కోచ్‌లోకి వచ్చారు. జవాన్ ప్యాంట్ తడిసి ఉండటాన్ని గమనించారు. ఫొటోలు తీసుకుని వెళ్లిపోయారు.
మరోవైపు ఆ జవాన్‌పై ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో ఆ దంపతులు మరోసారి రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. రైలు ఝాన్సీ స్టేషన్‌కు చేరగా ఆర్పీఎఫ్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు ఆ కోచ్ వద్దకు చేరుకున్నారు. మూత్ర విసర్జనతో ఇబ్బంది కలిగించిన జవాన్‌పై లలిత్‌పూర్‌లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఆ సైనికుడిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆ మహిళ ఆన్లైన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో), రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేసింది.