పాట్నా : బీహార్ రాజధాని పాట్నాలోని రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఇంట్లోకి ఆదివారం సాయంత్రం కొంతమంది మందుబాబులు దూసుకెళ్లారు. తేజ్ ప్రతాప్ యాదవ్ సన్నిహితుడు, ఆర్జేడీ యూత్ వైస్ ప్రెసిడెంట్ సృజన్ స్వరాజ్‌ను ఇష్టమొచ్చినట్లు తిట్టారు. అంతటితో ఆగకుండా స్వరాజ్‌ను చంపేస్తామని బెదిరించారు.
ఈ ఘటనపై స్వరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గౌరవ్ యాదవ్ అనే వ్యక్తి మద్యం సేవించి, తన స్నేహితులతో కలిసి తేజ్ ప్రతాప్ యాదవ్ ఇంట్లోకి ప్రవేశించారని స్వరాజ్ పేర్కొన్నారు. తనను చంపేస్తానని బెదిరింపులకు గురి చేశారని చెప్పారు. గౌరవ్ యాదవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సృజన్ డిమాండ్ చేశారు. తనకు పోలీసులతో రక్షణ కల్పించాలని కోరారు.