లక్నో: మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్ ఒక బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైకర్ కారు బానెట్, బంపర్ మధ్య చిక్కుకున్నాడు. అయితే కారు నిలుపని డ్రైవర్ అతడ్ని కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. చివరకు మెడికల్ షాపు ముందున్న బైక్‌తోపాటు పేవ్మెంట్ను ఢీకొట్టాడు. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు. (Drunk Driver Hits Biker) మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్‌ను చితకబాదారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం రద్దీ రోడ్డులో ఒక కారు వేగంగా దూసుకొచ్చింది. ఒక బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తి కారు బానెట్‌పై పడ్డాడు. అయినప్పటికీ కారును డ్రైవర్ ఆపలేదు. బానెట్, బంపర్ మధ్య చిక్కుకున్న బైకర్‌ను కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. చివరకు ఒక మెడికల్ షాపు ముందున్న బైక్‌తోపాటు పేవ్మెంట్ను ఢీకొట్టడంతో ఆ కారు ఆగింది.
కాగా, ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. కొంత మంది తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్‌ను ప్థానికులు కొట్టారు. కారు బానెట్‌పై పడిన బైకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మెడికల్ షాపు వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
अमरोहा : फिल्मी स्टाइल में शराबी ने कार से बाइक चालक को रौंदा हादसे की पूरी घटना सीसीटीवी कैमरे में कैद
▶️ शराबी कार चालक को पब्लिक ने जमकर पीटा,देखें वीडियो👇 #Amroha #UttarPradesh #Drunk #UPNews #ViralVideos #TheSootr pic.twitter.com/FJMBb4yP5k
— TheSootr (@TheSootr) January 4, 2025