జైపూర్ : రాజస్థాన్ జైపూర్‌లోని విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. యూఏఈ నుంచి వచ్చిన ఓ యువతి నుంచి దాదాపు రూ.20కోట్ల విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నది. సదరు యువతి బ్యాగ్‌లో డ్రగ్స్‌ను దాచుకొని తీసుకువచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టులో సదరు యువతి అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్, పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీలు చేశారు. ఈ క్రమంలో బ్యాగులో రెండు కిలోల హెరాయిన్‌ను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో హెరాయిన్ విలువ రూ.20 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. డ్రగ్స్ రవాణాపై కస్టమ్ విభాగం విచారణ జరుపుతున్నది.