బెంగెళూరు : బెంగళూరులోని రద్దీ రోడ్లలో ఒంటరిగా కారులో షికారు చేస్తున్నారా? అయితే త్వరలో మీరు రద్దీ పన్ను చెల్లించక తప్పదు. నిత్యం ట్రాఫిక్ జామ్‌లు, గుంతలు నిండిన రోడ్లమీద ప్రయాణంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రద్దీ రోడ్లలో ఒంటరిగా కారులో ప్రయాణించే వారిపై రద్దీ పన్ను వేయాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది. బుధవారం కార్పొరేట్ దిగ్గజాలతో సమావేశమై సమస్యలను పరిష్కరించడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించింది.
బెంగళూరు: ఔటర్ రింగ్ రోడ్లో ట్రాఫిక్‌ను తగ్గించడానికి బెంగళూరులోని విప్రో క్యాంపస్ మీదుగా పరిమితంగా ట్రాఫిక్‌ను అనుమతించాలంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన విజ్ఞప్తిని విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ తిరస్కరించారు. ‘క్యాంపస్ ఒక ప్రైవేట్ ఆస్తి. అంతర్జాతీయ క్లయింట్లకు సేవలు అందించే సెజ్‌లో భాగం’ అని పేర్కొన్న ఆయన.. ఇందులోని పాలనా, చట్టపరమైన సవాళ్లను నొక్కి చెప్పారు.