GPS | ప్రాణం తీసిన జీపీఎస్.. ఇద్దరు వైద్యుల ప్రాణాలను బలిగొన్న గూగుల్ మ్యాప్స్
భారీ వర్షంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను, గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని కారును నడిపినందుకు ఇద్దరు యువ వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు నేరుగా పెరియార్ నదిలోకి దూసుకెళ్లడమే ఈ విషాదానికి కారణం.
- భారీ వర్షంలో గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని డ్రైవింగ్
- నదిలోకి దూసుకెళ్లిన కారు
- ఇద్దరు వైద్యుల మృతి.. మరో ముగ్గురికి గాయాలు
- కేరళలోని ఎర్నాకుళంలో ఘటన
- వర్షంలో జీపీఎస్ వాడొద్దు
- పోలీసుల మార్గదర్శకాలు
GPS | కొచ్చి, అక్టోబర్ 2: భారీ వర్షంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను, గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని కారును నడిపినందుకు ఇద్దరు యువ వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు నేరుగా పెరియార్ నదిలోకి దూసుకెళ్లడమే ఈ విషాదానికి కారణం. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాదాపు 12.30 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. త్రిసూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు దవాఖానలో వైద్యులుగా పనిచేస్తున్న అద్వైత్ (29), అజ్మల్ (29) శనివారం రాత్రి విధులు ముగించుకుని హోండా సివిక్ కారులో ఇండ్లకు బయల్దేరారు. వీరితోపాటు డాక్టర్ తబ్సిర్, ఎంబీబీఎస్ విద్యార్థిని తమన్నా, నర్సు జిస్మాన్ కూడా ఆ కారులో ఎక్కారు. డ్రైవర్ సీటులో డాక్టర్ అద్వైత్ కూర్చున్నాడు. మర్నాడు అతని పుట్టినరోజు కావడంతో మార్గం మధ్యలో షాపింగ్ చేసి బయల్దేరారు. ఆ సమయంలో భారీ వర్షం పడుతుండటంతో రోడ్డు సరిగా కనిపించలేదు. దీంతో గూగుల్ మ్యాప్స్ను అనుసరిస్తూ కారును నడుపుతున్న అద్వైత్.. ఆ మార్గం మధ్యలో నీరు నిలిచి ఉన్న ఓ ప్రాంతాన్ని రోడ్డుగా భ్రమించాడు. కారును వేగంగా ఆ నీటిలోకి నడిపాడు. కానీ, అది పెరియార్ నది అని గుర్తించేలోపే ఆ కారు నీటిలో మునిగిపోయింది. దీంతో స్థానికులు స్పందించి ముగ్గురిని రక్షించారు. అద్వైత్, అజ్మల్ ప్రాణాలు కోల్పోయారు.
వర్షాకాలంలో గూగుల్ మ్యాపుల వినియోగం వద్దు
ఈ దుర్ఘటన నేపథ్యంలో ప్రయాణాలకు టెక్నాలజీని ఉపయోగించడంపై కేరళ పోలీసులు సరికొత్త మార్గదర్శకాలను జారీచేశారు. ప్రత్యేకించి వర్షాకాలంలో జీపీఎస్ను, గూగుల్ మ్యాప్స్ను వినియోగించవద్దని సూచించారు. సాధారణంగా వానకాలంలో రోడ్డు మార్గాలను తరచుగా మళ్లించడం జరుగుతుందని, కానీ ఆ డైవర్షన్లు గూగుల్ మ్యాపుల్లో కనిపించకపోవచ్చని హెచ్చరించారు. ‘ప్రస్తుత కాలంలో డ్రైవింగ్కు గూగుల్ మ్యాప్లు ఉపయుక్తమైనవే అయినప్పటికీ వాటిని అనుసరిస్తూ తెలియని మార్గాల్లో వాహనాలను నడపడం, ముఖ్యంగా వర్షాకాలంలో గూగుల్ మ్యాప్లను నమ్ముకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Car driving
- doctors
- Google Maps
- GPS
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

