ఢిల్లీ : ఢిల్లీలో(Delhi) మరో దారుణం చోటు చేసుకుంది. నిర్భయ తరహా ఘటనను తలపించేలా కదులుతున్న ప్రైవేట్ బస్సులో(Private bus) ఓ మహిళపై దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన రాణిబాగ్ ప్రాంతంలో జరిగింది. బాధితులురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మే 12న రాత్రి బాధిత మహిళ తన పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆమె సరస్వతీ విహార్ బస్టాండ్ వద్ద వేచి ఉంది. సరిగ్గా అదే సమయంలో అక్కడకు ఒక ప్రైవేట్ బస్సు వచ్చి ఆగింది.
ఈ క్రమంలో బస్సు డ్రైవర్, కండక్టర్ కలిసి ఆమెను బలవంతంగా లోపలికి లాక్కెళ్లారు. కదులుతున్న బస్సులోనే ఆమెపై సామూహిక లైంగిక పాల్పడ్డారని, రాత్రంతా తనను దారుణంగా హింసించారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు.