బెంగుళూరు: బెంగుళూరులోని కెంపగౌడ ఇంటర్నేషన్ ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు 3 కేజీల కొకైన్(Cocaine) సీజ్ చేశారు. ఘనా దేశానికి చెందిన వ్యక్తి నుంచి ఆ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘనా దేశస్థుడిని అరెస్టు చేసినట్లు డీఆర్ఐ తన వెబ్సైట్లో తెలిపింది. మార్చి 18వ తేదీన అరెస్టు అయిన ఘనా దేశానికి చెందిన మహిళ వివరాలను అధికారులు వెల్లడించలేదు. సీజ్ చేసిన కొకైన విలువ ఎంత ఉంటుందో ఇంకా ప్రకటించలేదు.
3.186 కేజీల కొకైన్ విలువ మార్కెట్లో సుమారు 38 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితురాల్ని జెన్నిఫర్ అబ్బేగా గుర్తించారు. దోహ నుంచి ఆమె వచ్చింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఆ మహిళను డీఆర్ఐ అధికారులు క్షుణ్ణంగా చెక్ చేశారు. బెంగుళూరు ఎయిర్పోర్టులో డీఆర్ఐ అధికారులు నటి రన్యా రావు నుంచి సుమారు 14 కేజీల బంగారాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే.