తిరువనంతపురం: శతాధిక విద్యార్థిని కార్త్యాయని అమ్మ కన్నుమూశారు. కేరళ రాష్ట్రం ప్రవేశపెట్టిన లిటరసీ మిషన్లో భాగంగా చదువు నేర్చుకున్న అతిపెద్ద వయసు మహిళగా రికార్డు సృష్టించిన 101 ఏండ్ల కార్త్యాయని అమ్మ కోస్తా అలప్పుజా జిల్లాలోని చీపాడ్లో అనారోగ్యంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు గురువారం అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.
గ్రామానికి వెళ్లి నివాళి అర్పించిన ఏడీఎం మాట్లాడుతూ 96 ఏండ్ల వయసులో చదువు నేర్చుకుని రికార్డు సృష్టించిన అమ్మ నాలుగో తరగతికి సమానమైన ‘అక్షరలక్ష్యం’ పరీక్షలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నారని ప్రశంసించారు.