దేశీయంగా అభివృద్ధి చేసిన హైస్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవ రహిత ఏరియల్ వెహికల్ (యూఏవీ)ను కర్ణాటకలోని చిత్రదుర్గలో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ వెల్లడించింది.
ఈ యూఏవీని డీఆర్డీవో అభివృద్ధి చేసింది. దేశ సాంకేతిక పురోగతికి ఇది మరో నిదర్శనమని రక్షణ శాఖ పేర్కొన్నది.