MIGM | న్యూఢిల్లీ: అత్యాధునిక సముద్ర గర్భ నావికా దళ మందుపాతరను భారత దేశం విజయవంతంగా పరీక్షించింది. దీనిని మన దేశంలోనే డిజైన్ చేసి, అభివృద్ధి చేశారు. దీనిని మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ (ఎంఐజీఎం) అంటారు. డీఆర్డీవో, భారత నావికా దళం దీనిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ మందుపాతరను డీఆర్డీవో ల్యాబొరేటరీల సహకారంతో విశాఖపట్నంలోని నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసినట్లు తెలిపింది. ఆధునిక స్టెల్త్ షిప్స్, జలాంతర్గాములను దెబ్బ తీసేందుకు ఇది ఉపయోగపడుతుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీవో, భారత నావికా దళాన్ని ప్రశంసించారు. ఈ మందుపాతర వల్ల సముద్రంలోపల యుద్ధం చేసే సత్తా భారత నావికా దళానికి మరింత పెరుగుతుందన్నారు.