న్యూఢిల్లీ : కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిగా అంజు రాఠీ రాణా బుధవారం నియమితులయ్యారు. ఈ పదవిలో నియమితురాలైన తొలి మహిళ ఆమె కావడం విశేషం. ఆమె 2017లో జాయింట్ సెక్రటరీగా న్యాయ మంత్రిత్వ శాఖలో చేరారు. అంతకు ముందు ఆమె 18 సంవత్సరాలపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఢిల్లీ ప్రభుత్వం తరపున పని చేశారు.