తిరువనంతపురం: నిరసనల నేపథ్యంలో.. దూరదర్శన్.. ద కేరళ స్టోరీ(The Kerala Story) చిత్రాన్ని శుక్రవారం ప్రసారం చేసింది. రాత్రి 8 గంటలకు డీడీలో ఆ సినిమా ప్రారంభమైంది. కేరళలోని సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించినా.. ఆ చిత్రాన్ని ప్రసారం చేశారు. మరో వైపు సీపీఎంకు చెందిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విభాగం ఓ వీడియోను ప్రదర్శించింది. యూట్యూబర్ ద్రువ్ రాథే తీసిన ద కేరళ స్టోరీ ట్రూ ఆర్ ఫేక్ వీడియోను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్లే చేశారు. యూత్ కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. నగరంలో ఉన్న డీడీ ఆఫీసుకు రాత్రి 8.30 నిమిషాలకు నిరసన ర్యాలీ తీసింది. అంతకుముందు సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు. ఆ సినిమా ప్రదర్శనతో మతపరమైన సమస్యలు ఉత్పన్నం అవుతాయని, సినిమా స్క్రీనింగ్‌ను ఆపాలని కోరాయి.