లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఎస్పీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. టీవీ ట్రెండ్స్‌ను నమ్మకండి.. చివరిదాకా వేచి చూడండి అని అఖిలేష్ సూచించారు. చివరికి ప్రజాస్వామ్యమే గెలుస్తుందన్నారు. ఎస్పీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయన్నారు. దాదాపు 100 స్థానాల్లో 500 ఓట్ల తేడాతో ఎస్పీ, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతుందని అఖిలేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు సమీకరణాలు మారే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం యూపీలో బీజేపీ 267 స్థానాల్లో, ఎస్పీ 130 స్థానాల్లో ముందంజలో ఉంది.
उत्तर प्रदेश विधानसभा चुनावों के रुझानों में 100 सीटों का अंतर 500 वोटों के करीब है।
समाजवादी पार्टी गठबंधन के कार्यकर्ताओं, पदाधिकारियों एवं नेताओं से अपील है कि वो सतर्कता बनाए रखें।
— Samajwadi Party (@samajwadiparty) March 10, 2022