కోల్‌కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్‌పై కుట్ర జరుగుతున్నదని మండిపడ్డారు. బెంగాల్‌కు ఢిల్లీ డబ్బులు అవసరం లేదని తేల్చిచెప్పారు. తన కాళ్ల మీద తాను నిలబడే సత్తా బెంగాల్‌కు ఉన్నదని అన్నారు. కొందరు ఇక్కడ కూర్చొని, ఇక్కడి తిండి తింటూ బెంగాల్‌కు నిధులు ఇవ్వొద్దని కేంద్రానికి నూరిపోస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం కుట్రలో భాగంగానే తృణమూల్ కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని మమత అన్నారు. గుజరాత్, హిమాచల్ ఎన్నికలకు ముందు కేంద్రం ఎన్నికల బాండ్ల ద్వారా దండుకొంటున్నదని విమర్శించారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ గెలవదని, 2019 ఎన్నికలకూ, ఇప్పటికీ రాజకీయ సమీకరణాలు మారిపోయాయన్నారు. రాష్ట్రపతి ముర్ముపై పార్టీ నాయకుడు గిరి చేసిన వ్యాఖ్యలకు మమత క్షమాపణలు చెప్పారు.