న్యూఢిల్లీ: మెడికల్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉండకూడదని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. సమస్య పరిష్కారానికి సంబంధిత వర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను తీసుకోవాలని, ఇదే అంశంపై గతంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది.
సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లోని సీట్లు కూడా ఖాళీగా ఉంటుండటాన్ని సుప్రీంకోర్టు 2023 ఏప్రిల్లో గుర్తించింది.