బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక-ఆర్థిక, విద్యా సర్వేకు ప్రజల నుంచి తీవ్ర అనాసక్తి వ్యక్తమవుతున్నది. రాజధాని బెంగళూరులో 15 శాతం మందికి పైగా నివాసితులు ఇందులో పాల్గొనడానికి తిరస్కరిస్తూ ఏకంగా అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ల తలుపులే మూసేస్తున్నారు. ఎన్యూమరేటర్లు లోపలికి ప్రవేశించడానికి అంగీకరించడం లేదు.
నగరంలోని బనశంకరి ప్రాంతంలో 30 ఫ్లాట్లకు కేవలం ఇద్దరు మాత్రమే ఈ సర్వేకు సహకరించారు. ఇది ఒక్క ప్రాంతమే కాదు. నగరమంతా ఇదే తరహా వైఖరి వ్యక్తమవుతున్నది. ‘మేమైతే కొన్ని ఇండ్లకు నాలుగైదు సార్లు వెళ్లాం. మేము బెల్ కొట్టగానే తలుపులు తీస్తున్న వారికి సర్వే గురించి చెప్పగానే మా ముఖం మీదే ‘పోండన్నట్టు’ తలుపులు వేస్తున్నారు. కొన్ని చోట్లయితే ఏకంగా మాకు తీవ్ర అవమానాలు కూడా ఎదురవుతున్నాయి’ అని ఎన్యూమరేటర్లు తెలిపారు.