ముంబై జూన్ 19 ( నమస్తే తెలంగాణ): ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయని వారికి ఉచిత రేషన్ నిలిపివేయాలని బీజేపీ మహారాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ గుప్తా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. లోక్సభ ఎన్నికల్లో ముంబైలో తక్కువ ఓటింగ్ శాతం నమోదవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని నేరుగా ఆపకుండా ఓటు వేసిన వారికే ఉచితంగా ధాన్యం ఇవ్వాలని కోరారు.