Navy officer’s wife : పాకిస్థాన్ (Pakistan) లోని ఉగ్రవాద స్థావరాల (Terror hide outs) ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజామున భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పై పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) మృతుడు, నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (Vinay Narwal) భార్య హిమాన్షి నర్వాల్ (Himanshi Narawal) స్పందించారు. ఉగ్రవాదుల ఏరివేత చర్యను ఇంతటితో ఆపొద్దని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులను తుదముట్టించడంలో ఆరంభం మాత్రమే కావాలని వ్యాఖ్యానించారు.
‘నా భర్త రక్షణ బలగాల్లో పనిచేసేవాడు, శాంతిని కాపాడాలని, అమాయకుల జీవితాలకు రక్షణ కల్పించాలని భావించేవాడు. దేశంలో విధ్వంసం, ఉగ్రవాదం అంతం కావాలని కోరుకునే వాడు. ఇవాళ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన భారత సైనికులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అయితే నా అభ్యర్థన ఏమంటే ఉగ్రవాదులపై పోరాటాన్ని ఇంతటితో ఆపొద్దు. ఆపరేషన్ సిందూర్ దేశంలో ఉగ్రవాదాన్ని తదముట్టించడానికి ఆరంభం మాత్రమే కావాలి.’ అని హిమాన్షి వ్యాఖ్యానించారు.
ఉగ్రదాడికి కొద్ది రోజుల ముందే ఏప్రిల్ 16న వినయ్ నర్వాల్, హిమాన్షి నర్వాల్ల వివాహం జరిగింది. ఏప్రిల్ 19న రిసెప్షన్ నిర్వహించారు. ఏప్రిల్ 21న హనీమూన్ కోసం పహల్గాంకు వెళ్లారు. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్ మృతిచెందాడు. తన భర్తను పేరు అడిగి మరీ కాల్చిచంపారని హిమాన్షి నర్వాల్ చెప్పారు. కాగా పహల్గాం ఉగ్రదాడిలో వినయ్ నర్వాల్తోపాటు మరో 25 మంది మరణించారు. వారిలో ఒక నేపాలీ ఉన్నారు.