చెన్నై: కేవలం జనాభా ఆధారంగా దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ సీట్లను నిర్ణయించరాదు అని కేంద్రాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(CM MK Stalin) కోరారు. ఒకవేళ అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగితే, దాన్ని ప్రతిఘటిస్తామని ఆయన అన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా తమ రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరిగినా సహించేది లేదన్నారు. మా డిమాండ్ చాలా స్పష్టంగా ఉందని, కేవలం జనాభా ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగవద్దు అని, జనాభా నియంత్రణకు దక్షిణా రాష్ట్రాలు తీవ్ర చర్యలు తీసుకున్నాయని, ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా ఆ రాష్ట్రాలను శిక్షించవద్దు అని స్టాలిన్ తన వీడియో సందేశంలో తెలిపారు. 72వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఈ సందేశాన్ని రిలీజ్ చేశారు. తమిళ భాష, సంస్కృతిని కాపాడుకునేందుకు కూడా పోరాటం చేస్తానన్నారు.
ஒரே இலக்கு!
தமிழ்நாடு போராடும்!
தமிழ்நாடு வெல்லும்!#FairDelimitationForTN pic.twitter.com/zQ1hMIHGzo— M.K.Stalin (@mkstalin) February 28, 2025