రోజూ రూ.6-8 లక్షలు చోరీ
అయోధ్య రామాలయంలో ప్రతి రోజూ రూ.6-8 లక్షల విరాళాలు పక్క దారి పట్టి ఉంటాయని సిట్ అంచనా వేసింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం విరాళాల చోరీ విషయం వెలుగులోకి రాక ముందు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంక్ ఖాతాలకు రోజుకు రూ.16-18 లక్షల విరాళాలు వచ్చేవి.
- అయోధ్య కేసులో సిట్ అంచనా
అయోధ్య: అయోధ్య రామాలయంలో ప్రతి రోజూ రూ.6-8 లక్షల విరాళాలు పక్క దారి పట్టి ఉంటాయని సిట్ అంచనా వేసింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం విరాళాల చోరీ విషయం వెలుగులోకి రాక ముందు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంక్ ఖాతాలకు రోజుకు రూ.16-18 లక్షల విరాళాలు వచ్చేవి. కేసు నమోదయ్యాక ఆ ఖాతాలకు రోజుకు రూ.24-26 లక్షల విరాళాలు వచ్చాయని సిట్‌కు బ్యాంకు అధికారులు వెల్లడించారు. నగదు విరాళాలను ఎస్బీఐ ఒక ప్రైవేట్ ఏజెన్సీతో కలిసి పర్యవేక్షిస్తుంది. విరాళాల లెక్కింపు ప్రక్రియను రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి సుభాష్ శ్రీవాస్తవ పర్యవేక్షిస్తారు. విరాళాల గల్లంతు గురించి ఒక సహోద్యోగి ఆయనకు తెలిపినప్పుడు.. ‘దేవుడు చూస్తూనే ఉన్నాడు..ఇది నీ ఇంట్లో నుంచో లేదా నా ఇంట్లో నుంచో పోయేదేమీ కాదు కదా’ అని వ్యాఖ్యానించాడు. ఆలయ ట్రస్ట్‌తో కుదిరిన ఒప్పందంలోని వ్యత్యాసాలు, విధానపరమైన మార్పుల గురించి కూడా సిట్ బ్యాంక్ అధికారులను ప్రశ్నించింది. అనుమానిత అవకతవకలను ఉన్నతాధికారులకు ఎందుకు నివేదించలేదని వారిని అడిగింది. నగదు లెక్కింపులో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ పాత్రపైనా ప్రశ్నలు లెవనెత్తింది. ట్రస్ట్ వార్షిక ఆడిట్ నివేదికలు, ఆర్థిక రికార్డులు, ఇతర కీలక పత్రాలను తమకు అందించాలని సిట్ కోరింది. దర్యాప్తులో భాగంగా వాటిని తిరిగి ఆడిటింగ్ చేయడాన్ని సిట్ పరిశీలిస్తున్నది.
5 కోట్ల బంగారు రామచరిత మానస్ మాయం!
తన కుటుంబం విరాళంగా ఇచ్చిన రూ.5 కోట్ల విలువైన బంగారు పలకల రామచరిత మానస్‌ను అయోధ్య రామాలయం నుంచి బయటకు తరలించారని మాజీ ఐఏఎస్ అధికారి ఎస్ లక్ష్మీనారాయణన్ ఆరోపించారు. 2024 ఏప్రిల్‌లో తాము ఆలయ ట్రస్ట్‌కు ఈ కానుకను అందించామన్నారు. అయితే ఆ తర్వాత ఆలయ ప్రాంగణం నుంచి దాన్ని తరలించారని ఆయన తెలిపారు. ఆలయానికి ఇచ్చిన ప్రతి కానుకను మందిరంలోనే ప్రదర్శించలేమని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తనకు చెప్పారని ఆయన వెల్లడించారు. ఆలయానికి విరాళంగా ఇచ్చిన వెండి కడ్డీలు, ఇటుకలు పెద్ద సంఖ్యలో కనిపించడం లేదని కొన్ని రోజుల క్రితం విపక్షాలు, భారత బులియన్, నగల వర్తకుల సంఘం ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

