న్యూఢిల్లీ: ఐఐటీ-కాన్పూర్ క్యాంపస్లో ఇటీవల నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం దాతృత్వానికి ఒక మైలురాయిగా నిలిచింది. తమ కెరీర్, జీవితాల్ని తీర్చిదిద్దటంలో కీలకంగా నిలిచిన విద్యా సంస్థకు రూ.100 కోట్లు విరాళంగా అందజేస్తామని వాళ్లంతా ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేశారు.
దీనిపై ఐఐటీ-కాన్పూర్ సోమవారం స్పందిస్తూ, ‘దేశంలోనే అత్యధికం. పూర్వ విద్యార్థుల విరాళంలో ఇది చారిత్రక మైలురాయిని సూచిస్తున్నది. ఐఐటీ-కాన్పూర్ పట్ల కృతజ్ఞతా భావాన్ని తెలుపుతుంది’ అని పేర్కొన్నది. ఐఐటీ-కాన్పూర్లో మిలీనియం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సొసైటీని స్థాపించడానికి విరాళాల్ని ఉపయోగించాలని పూర్వ విద్యార్థులు ప్రతిపాదించారు.