న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: పశ్చిమాసియా దేశమైన ఇరాన్‌పై భీకర దాడులు చేయడానికి సమయం మించిపోతున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం హెచ్చరించారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి లేదా హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్‌కు 10 రోజుల గడువు ఇచ్చిన విషయం గుర్తుందా అని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులో ప్రశ్నించారు.
సమయం మించిపోతున్నది. ఇరాన్‌పై ప్రళయం విరుచుకు పడడానికి 48 గంటల సమయం మాత్రమే ఉంది అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. శుక్రవారం ఇరాన్ వైమానిక దళాలు రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసిన తర్వాత ట్రంప్ ఈ హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ అభ్యర్థన మేరకు ఆ దేశ ఇంధన మౌలిక సదుపాయాలపై ఏప్రిల్ 6 వరకు దాడుల చేయమని అమెరికా పేర్కొంది.