ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్ మదుపరులకు రుచించలేదు. ఆదాయ పన్ను మినహాయింపు పెంపుదల సహా పలు నిర్ణయాలు సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. బడ్జెట్ సందర్భంగా శనివారం ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహించారు.
ఊగిసలాటల మధ్య కొనసాగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నది. 77,006 పాయింట్ల నుంచి 77,899 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ చివరకు 5.39 పాయింట్లు అందుకొని 77,505.96 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 26.25 పాయింట్లు కోల్పోయి 23,482.15 వద్ద ముగిసింది. రియల్టీ టాప్ గెయినర్‌గా నిలిచింది.