ముంబై, డిసెంబర్ 21: హెచ్1బీ వీసాదారులు అమెరికాలోనే తమ వీసాను రెన్యువల్ చేసుకునే పైలట్ ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 29న ప్రారంభించనున్నట్టు అమెరికా వెల్లడించింది. తొలి దశలో భారత్, కెనడాకు చెందిన 20 వేల మందికి అవకాశం కల్పించనున్నట్టు తెలిపింది.
జనవరి 29 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు హెచ్1బీ వీసాదారులు యూఎస్లోనే తమ వీసాలను రెన్యువల్ చేసుకోవచ్చు. ప్రతివారం (జనవరి 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో) 4 వేల అప్లికేషన్ స్లాట్లను అందుబాటులోకి తెస్తారు. ఇందులో 2 వేలు భారతీయులకు కేటాయించనున్నారు. 2021 ఫిబ్రవరి 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య మిషన్ ఇండియా జారీచేసిన వీసాలను మాత్రమే రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.