Viral Video : ఇంటర్నెట్ సెన్సేషన్ డాలీ ఛాయ్‌వాలా గత వారం దుబాయ్‌లో కాఫీ ఎంజాయ్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. దుబాయ్ పర్యటన నుంచి వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన డాలీ బుర్జ్‌ఖలీఫా టాప్‌లో కాఫీ ఆస్వాదిస్తున్నా అని క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోలో డాలీ లగ్జరీ కారులో బుర్జ్ ఖలీఫాకు చేరుకోగా అధికారులు, పలువురు ఇతర ఇన్ఫ్లుయర్స్ అతడికి స్వాగతం పలకడం చూడొచ్చు. ఆపై వారితో కలిసి బుర్జ్ ఖలీఫా 148వ అంతస్తుకు చేరుకుని అక్కడ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆపై కాఫీని ఆస్వాదించడం కనిపిస్తుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో డాలీ ఛాయ్‌వాలాను మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధాపకులు బిల్ గేట్స్ కలుసుకుని నాగపూర్‌లోని అతడి టీస్టాల్ వద్ద ఫొటోగ్రాఫ్ తీసుకోవడంతో డాలీ పేరు నెట్టింట మార్మోగింది. బిల్ గేట్స్ షేర్ చేసిన ఛాయ్ పే చర్చ వీడియోకు మిలియన్ల వ్యూస్ లభించాయి.
Read More
Sports | క్రీడలు చూడటం వల్ల వినోదంతోపాటు మానసిక ఆరోగ్యం..!