Dog | న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్లో ఓ శునకం 67 మంది ప్రాణాలను కాపాడింది. ఈ శునకం సకాలంలో పెద్దగా మొరుగుతూ, తిరగడంతో వీరంతా భారీ వరదల నుంచి తప్పించుకోగలిగారు. ఈ సంఘటన మండీ జిల్లాలోని సియాథీ గ్రామంలో జూన్ 30 అర్ధరాత్రి జరిగింది. ఈ గ్రామస్థుడు నరేంద్ర మాట్లాడుతూ, తన ఇంట్లోని కుక్క అకస్మాత్తుగా లేచి, పెద్ద పెట్టున అరిచిందని.. ఆ అరుపులు విని గమనించగా.. గోడ పగిలి వరద నీరు లోపలికి రావడం ప్రారంభమైందన్నారు.
వెంటనే తాను తమ ఇంట్లోని వారితో పాటు ఇరుగు పొరుగును అప్రమత్తం చేశానని చెప్పారు. దీంతో 20 కుటుంబాలకు చెందిన 67 మంది పారిపోయినట్లు తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే కొండచరియ విరిగిపడి సుమారు 12 ఇండ్లు కూలిపో యాయన్నారు.