వందకిలోల కేక్ తెచ్చారు. దానిపై హ్యాపీ బర్త్‌డే క్రిష్ అని రాయించారు. ఈ బర్త్ డే పార్టీకి 4వేల మంది అతిథులు హాజరయ్యారు. ఈ హంగామా చూసి ఓ సెలెబ్రిటీ బర్త్ డే అనుకుంటే మీరు కేకులో కాలేసినట్లే. ఇది ఓ కుక్క బర్త్ డే వేడుక. కర్ణాటకకు చెంది ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించగా, వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
శివప్ప యెల్లప్ప మరడి ఇటీవల కర్ణాటకలోని బెలగావిలో తన కుక్క కోసం గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ వీడియోలో అతను తన పెంపుడు కుక్క క్రిష్‌తో కలిసి వంద కిలోల కేక్‌ను కట్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా దాదాపు 4000 మందికి అన్నదానం చేశారు. ఈ వీడియో నెటిజన్ల మనసును దోచుకుంది. అందరూ శివప్పను ప్రశంసలతో ముంచెత్తారు. క్రిష్ చాలా అదృష్టవంతుడు అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.
Dog Birthday Celebration :ಸಾಕು ನಾಯಿ ಹುಟ್ಟುಹಬ್ಬಕ್ಕೆ 100 ಕೆ.ಜಿ ಕೇಕ್! ||Karnataka Tak||#dogbirthday #doglover #belagamnews pic.twitter.com/csbjx2NDeo
— Karnataka Tak (@karnataka_tak) June 23, 2022