Harish Rawat | పీఏ ఇంట్లో నగదు, నగలు స్వాధీనం చేసుకున్న ఈడీ.. కీలక పదవులకు ఉత్తరాఖండ్ మాజీ సీఎం రాజీనామా..!
Harish Rawat | ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి (Uttarakhand Ex CM), కాంగ్రెస్ సీనియర్ నాయకుడు (Congress Senior Leader) హరీశ్ రావత్ (Harish Rawat) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రెండు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Harish Rawat : ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి (Uttarakhand Ex CM), కాంగ్రెస్ సీనియర్ నాయకుడు (Congress Senior Leader) హరీశ్ రావత్ (Harish Rawat) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన రెండు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన పీఏ చందన్ సింగ్ జీనా ఇంట్లో ఈడీ (Enforcement Directorate) సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం (PCC), కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) శాశ్వత ఆహ్వానితుడి పదవుల నుంచి రావత్ వైదొలిగారు. ఎన్నికల వేళ.. తన వల్ల పార్టీకి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రావత్ తెలిపారు. ఈడీ గురువారం దెహ్రాదూన్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసింది. 2016లో ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ నియామక పరీక్షలో ఓఎంఆర్ షీట్లను మార్చి అక్రమాలకు పాల్పడ్డారని జీనాపై నమోదైన కేసుకు సంబంధించి ఈ చర్యలు చేపట్టింది.
జీనా నివాసంలో రూ.32 లక్షల నగదు, సుమారు 200 గ్రాముల బంగారు నాణేలు, ఆభరణాలు, 12 ఖరీదైన గడియారాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. జీనా, ఆయన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల్లోని రూ.52.16 లక్షలను స్తంభింపజేసింది. అయితే జీనాపై వచ్చిన ఆరోపణలను తాను నమ్మడం లేదని, అతను బాగా కష్టపడి పనిచేసే వ్యక్తి అని రావత్ చెప్పారు. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. గతంలో రావత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీనా ఓఎస్డీగా పనిచేశారు. ఆ తర్వాత పీఏగా కొనసాగుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

