Akbaruddin Owaisi | జీహెచ్ఎంసీ విభజన బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆయనతోపాటు అందరూ సభ్యులు జనాభా పెరుగుతోంది.. ప్రతీది పెరుగుతున్నాయి.. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా చేయాల్సిన అవసరముందని చెప్పిన మాటలతో నేను ఏకభవించా. అలానే చేశారు బాగుంది.. అయితే మంత్రి కానీ, ప్రభుత్వం కానీ జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు అసలు కారణం ఏంటో ఈ బిల్లులో మాత్రం ఎక్కడా చెప్పలేదన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ.
సివిల్ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్‌మెంట్‌తోపాటు చాలా విభాగాలున్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీలో ఏం జరుగుతుంది సార్.. ఒక డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగి ఇంకో డిపార్ట్మెంట్కు వెళ్లి పనిచేస్తున్నారు. ఉన్న జీహెచ్ఎంసీలోనే ఉద్యోగుల కొరత ఉంది, వేతనాలు సరిపోవట్లేదు . మరి కొత్తగా ఏర్పాటు చేసిన కార్పోరేషన్లు ఎలా నడుస్తాయి.. ఎవరైనా ఈ ప్రశ్నకు సమాధానమివ్వగలరా..? అని అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
జనాభా ఆధారంగా ప్రతీ కార్పొరేషన్లో చదరపు కిలోమీటర్‌కు అవసరమున్న ఉద్యోగులు ఎంతమంది.. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎంతమంది సిబ్బంది అవసరం..శాటిటేషన్ విభాగంలో ఎంతమంది అనే దానిపై వివరణ ఇవ్వలేదు.. కొత్తగా ఏర్పాటు చేసిన మూడు కార్పొరేషన్లకు ఉద్యోగులు ఎంత మంది కావాలి, అంత మందిని ఎలా తెస్తారు..? అని ప్రశ్నించారు.
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు అసలు కారణం ఏంటో చెప్పలేదు
ఉన్న జీహెచ్ఎంసీలోనే ఉద్యోగుల కొరత ఉంది, వేతనాలు సరిపోవట్లేదు అంటున్నారు
కొత్తగా ఏర్పాటు చేసిన మూడు కార్పొరేషన్లకు ఉద్యోగులు ఎంత మంది కావాలి, అంత మందిని ఎలా తెస్తారు?
– ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ pic.twitter.com/t1tVk1uYZw
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2026
Brahmotsavams | ఏపీ సీఎంకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత