డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కుక్కల దాడులు తీవ్రరూపం దాల్చాయి. చమోలీ జిల్లా నారాయణ్ బగఢ్ ప్రాంతంలో గురువారం నాటికి 11 మందిని కుక్కలు గాయపర్చాయి. దీంతో పది పాఠశాలలకు అధికారులు ఆగస్టు 23 దాకా సెలవు ప్రకటించారు. ఆ తర్వాత రెండు రోజులకు కుదించారు. ప్రస్తుతం 600 మంది విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహ్తిన్నారు. ఇంకోవైపు అటవీశాఖ యాక్షన్ టీమ్ రంగంలోకి దిగంది.
ఇప్పటికే మూడు కుక్కలను పట్టుకున్నారు. మిగతా వాటి కోసం గాలిస్తున్నారు. కాగా ఒక పిచ్చి పట్టిన కుక్క మిగతా కుక్కలను కరవడంతో అవన్నీ మనుషులపై దాడులు చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం ముగ్గురిని కరిచిన కుక్కులు.. బుధవారం ఏకంగా నలుగురిని గాయపర్చాయి. ఇందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. నారాయణ్ బగఢ్లో 17 మందితో కూడిన టీమ్ రెండు క్యాంపులు ఏర్పాటు చేసి కుక్కలను పట్టుకుంటున్నాయి.