న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ నివాసి సచిన్ (35)కు వైద్యులు శస్త్ర చికిత్స చేసి, 29 స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు, రెండు పెన్నులను తొలగించారు. దవాఖాన వర్గాల కథనం ప్రకారం, సచిన్ దురలవాట్లకు బానిసయ్యాడు. వాటిని మాన్పించాలనే ఉద్దేశంతో, ఆయనను డీఅడిక్షన్ సెంటర్లో చేర్పించారు. ఆ సెంటర్లో ఆయనకు తగినంత ఆహారం ఇచ్చేవారు కాదు.
తన ఇంటి నుంచి ఆహారం వచ్చినప్పటికీ, తన వరకు వచ్చేది కాదని ఆయన వాపోయాడు. దీంతో ఆయన స్పూన్లు, టూత్‌బ్రష్‌లు, పెన్నులను దొంగిలించి, ముక్కలు చేసి, గొంతులో కుక్కుకునేవాడు. నీళ్లు తాగి కడుపులోకి పంపించేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆయనకు కడుపు నొప్పి వచ్చింది. ఎక్స్‌రే, సీటీ స్కాన్‌లో ఆయన వివిధ వస్తువులు మింగినట్టు తెలిసింది.