కోల్‌కతా: మహిళా రోగికి డాక్టర్ మత్తుమందు ఇచ్చాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (doctor rapes patient) దీనిని వీడియో తీశాడు. బెదిరించి డబ్బులు వసూలు చేయడంతోపాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు బాధితురాలు తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడైన ఆ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హస్నాబాద్‌లోని ఇంట్లో క్లీనిక్ నిర్వహిస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ 26 ఏళ్ల మహిళా రోగికి మత్తుమందు ఇంజెక్షన్ చేశాడు. మత్తులో ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాలో షేర్ చేస్తానని ఆ మహిళను బెదిరించాడు. ఆమెను బ్లాక్మెయిల్ చేసి నాలుగు లక్షల వరకూ వసూలు చేశాడు. ఆ మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కాగా, బెదిరింపులకు విసిగిపోయిన ఆ మహిళ చివరకు తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆర్ఎంపీ డాక్టర్ నూర్ ఆలం సర్దార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. మహిళ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.