చెన్నై, అక్టోబర్ 10: సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు సాక్షాత్తు కేంద్ర మాజీ మంత్రినే టార్గెట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.99,999 కొట్టేశారు. దీనిపై చెన్నై పోలీసులకు, బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు మారన్ పోస్టులో పేర్కొన్నారు. ఆదివారం తన ఖాతా నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని చెప్పారు. మొబైల్కు ఓటీపీ రాలేదని, జాయింట్ ఖాతాదారు అయిన తన భార్యకు సైబర్ దుండగులు ఫోన్ చేసి డబ్బులు కాజేశారన్నారు. బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేసి ఖాతాను స్తంభింపచేసినట్టు చెప్పారు. ఓటీపీ రాకుండా తన ఖాతా నుంచి సొమ్ము ఎలా బదిలీ అయ్యిందో యాక్సిస్ బ్యాంక్ అధికారులు కూడా చెప్పలేకపోతున్నారని తెలిపారు.