Durai Murugan | చెన్నై, మార్చి 13: తమిళనాడుకు చెందిన సీనియర్ మంత్రి దురై మురుగన్ గురువారం ఉత్తరాది సంస్కృతిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఉత్తర భారతదేశ సంస్కృతిలో బహుభార్యత్వం, బహుభర్తృత్వం భాగమని ఆయన ఆరోపించారు. తమిళ ప్రజలను ఎవరైనా అవమానిస్తే వారి నాలుకలు కోస్తానని ఆయన హెచ్చరించారు.
తమిళ పంప్రదాయాలకు భిన్నంగా ఉత్తర ప్రాంత భారతీయులు బహుభార్యత్వాన్ని, బహుభర్తృత్వాన్ని పాటిస్తారని దురై మురుగన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఉత్తర భారతం పట్ల డీఎంకే విద్వేష భావాన్ని ప్రతిబింబిస్తున్నాయని బీజేపీ నాయకుడు అమర్ ప్రసాద్ రెడ్డి విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి స్టాలిన్ ఉత్తర భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.