Karnataka : లోక్సభ ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై ఆ పార్టీ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. ఈ భేటీకి సంబంధించి డిప్యూటీ సీఎం, కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తాము 14 నుంచి 15 స్ధానాల్లో విజయం సాధిస్తామని ఆశించామని చెప్పారు. తాము ఎక్కడ తప్పు చేశామో విశ్లేషించేందుకే ఈరోజు పార్టీ సమావేశం నిర్వహించామని తెలిపారు.
ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో విశ్లేషించుకుని, వాటిని సరిదిద్దుకుని భవిష్యత్లో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ముందుకెళతామని చెప్పారు. బీజేపీ, జేడీఎస్ రాబోయే రోజుల్లో కలిసి పోరాడతాయని తనకు తెలుసునని, భవిష్యత్లో ఈ రెండు పార్టీలను నిలువరించేందుకు ఏం చేయాలనేదానిపై కసరత్తు సాగిస్తున్నామని అన్నారు.
కాగా ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో కర్నాటకలో విపక్ష ఇండియా కూటమిపై బీజేపీ-జేడీయూతో కూడిన ఎన్డీయే పైచేయి సాధించింది. రాష్ట్రంలోని 28 లోక్సభ స్ధానాలకు గాను కాషాయ కూటమి 19 స్ధానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ కేవలం 9 స్ధానాలకు పరిమితమైంది. మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, హెచ్డీ కుమారస్వామి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, బీజేపీ యువమోర్చా చీఫ్ తేజస్వి సూర్య, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి వంటి ప్రముఖులు విజేతల్లో ఉన్నారు.
Read More :