DK Shivakumar | ఏడు నెలలుగా విపక్ష నేతను ఎన్నుకోలేని బీజేపీ : కాషాయ పార్టీపై డీకే శివకుమార్ ఫైర్
1992లో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం జరిగిన అల్లర్ల కేసులో హుబ్బలికి చెందిన వ్యక్తి అరెస్ట్‌ను బీజేపీ రాజకీయం చేస్తోందని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఆరోపించారు.
బెంగళూర్ : 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం జరిగిన అల్లర్ల కేసులో హుబ్బలికి చెందిన వ్యక్తి అరెస్ట్‌ను బీజేపీ రాజకీయం చేస్తోందని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఆరోపించారు. శాంతిభద్రతలను కాపాడే ప్రక్రియలో భాగంగానే అరెస్ట్ జరిగిందని తమ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడదని పేర్కొన్నారు.
తాము శాంతిని ప్రేమిస్తామని, కర్నాటకలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు చోటు లేదని స్పష్టం చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ క్రమంలో హుబ్బలికి చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని హోంమంత్రి ఈ విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చారని డీకే శివకుమార్ తెలిపారు. ఏడు నెలలుగా బీజేపీ విపక్ష నేతను ఎన్నుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు.
సార్వత్రిక ఎన్నికలు రానుండటంతో తాము రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నామని చాటుకునేందుకు బీజేపీ ఈ అంశాలను లేవనెత్తుతోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని, వారే దీటుగా బదులిస్తారని అన్నారు. వారి లాగా తాము ఇతర పార్టల కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం లేదని డీకే శివకుమార్ పేర్కొన్నారు. బీజేపీ తన హయాంలో బెంగళూర్, హుబ్బలిలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలపై పెద్దసంఖ్యలో కేసులు బనాయించిందని ఆరోపించారు. తాము అలా ఎప్పుడూ చేయలేదని, భవిష్యత్‌లోనూ చేయబోమని డీకే శివకుమార్ వివరించారు.
Read More :
Zomato | పెట్రోల్ దొరకలేదు.. గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో బాయ్.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- arrest
- BJP
- DK Shivakumar
- Hubbali
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ టీజర్ విడుదల.. జెన్ జీ ఆలోచనలతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

