బెంగళూరు, సెప్టెంబర్ 18 : ఎవరైనా సరే ప్రభుత్వాన్ని బెదిరించ లేరు.. బ్లాక్మెయిల్ చేయలేరని, అది ఎంతమాత్రం పనిచేయదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధానిలో మౌలిక వసతులు అధ్వాన్నంగా ఉన్నాయని తాము తమ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలిస్తున్నామంటూ ఒక లాజిస్టిక్స్ స్టార్టప్ సీఈవో ప్రకటించడం సంచలనం కలిగించింది.
ఈ క్రమంలో డీకే శివకుమార్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. మౌలిక సదుపాయాల సంబంధిత సమస్యలతో ఏ కంపెనీ కూడా ఐటీ రాజధానిని వదిలి వెళ్లకుండా తమ ప్రభుత్వం చూస్తుందని చెప్పారు. అయితే డీకే వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు.