DK Shivkumar : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ఫలితాలు తమకొక గుణపాఠమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (Karnataka deputy CM) డీకే శివకుమార్ (DK Shivkumar) అన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి (INDI alliance) కోసం కొత్త వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్బంధన్ భారీ ఓటమి నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఫలితాలు తమ పార్టీకి, మిత్రపక్షాలకు ఒక గుణపాఠమని పేర్కొన్నారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పని, ఇది తమకొక గుణపాఠమని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి కొత్త వ్యూహాలను రూపొందించాల్సిన అవసరం ఉందనేది తన అభిప్రాయమని చెప్పారు.
మహిళా సాధికారత, స్వయం ఉపాధి కింద మహిళలకు రూ.10,000 చొప్పున జమ చేయడం, మహిళా ఓటర్ల పెరుగుదల ఎన్డీయే కూటమి గెలుపుకు కారణమని భావిస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ఫలితాలు వచ్చాక కారణాలేమిటో తెలియాల్సి ఉందని శివకుమార్ అన్నారు. పూర్తి ఫలితాలు వచ్చాక మళ్లీ మాట్లాడతానని చెప్పారు.