బెంగళూరు, ఆగస్టు 26: కన్నడ నటుడు దర్శన్‌కు జైలులో విలాసవంతమైన సౌకర్యాలు కల్పించినట్టు వచ్చిన వార్తలపై బీజేపీ నేత అశోక సోమవారం విమర్శలు ఎక్కుపెట్టారు. ఇందుకు డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత శివకుమార్ బాధ్యుడని ఆరోపించారు. శివకుమార్ జైల్లో దర్శన్‌ను కలిసి అన్ని రకాలుగా సాయం చేయడానికి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ కేసులో ఆధారాల విధ్వంసానికి, సాక్షుల బెదిరింపుకు కుట్ర జరుగుతున్నదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు జైలు సిబ్బందిని సస్పెండ్ చేశామని.. జైలులో విచారణ జరపాలని హోంమంత్రిని ఆదేశించానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.