Clever donkey: కుటుంబంలో ఎవరైనా చెప్పిన మాట విననప్పుడు, మొరటుగా ప్రవర్తించినప్పుడు పెద్దవాళ్లు కోపంలో ఒరేయ్ గాడిద అని నిందిస్తుంటారు. ఇంకా కోపం ఎక్కువ వస్తే ఒరేయ్ అడ్డగాడిద అని కూడా తిడుతుంటారు. కానీ, తాజాగా ఓ గాడిద ప్రదర్శించిన తెలివితేటల గురించి తెలిస్తే ఇకపై ఎవరూ అలాంటి తిట్లను వాడరు. ఎందుకంటే ఆ గాడిద బుర్రను ఉపయోగించి తన పనిని సులభతరం చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇప్పటికే 80 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. అంతేగాక లైకులు, కామెంట్ల వర్షం కురుస్తున్నది. వీడియోలో గాడిద తెలివితేటలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకు ఆ గాడిద ఏం చేసిందా అనుకుంటున్నారా..? అయితే పదండి వివరాల్లోకి వెళ్దాం..
ఓ అడవిలో కొన్ని గాడిదలు ఒక మార్గం గుండా వెళ్తున్నాయి. ఈ క్రమంలో వాటి దారికి అడ్డంగా ఒక కర్ర పెట్టి కనిపించింది. దాంతో గుంపులోని గాడిదలు కొన్ని కష్టంగా కర్ర పైనుంచి దూకి ముందుకు కదిలాయి. ఇక తెలివైన గాడిద కూడా దూకాల్సిన సమయం వచ్చింది. కానీ అది మిగతా గాడిదల్లా కష్టపడలేదు. కర్ర దగ్గరికి వచ్చి కాసేపు ఆలోచించింది. తర్వాత నోటితో ఆ కర్రను పట్టుకుని పైకి లేపింది. అంతే ఆ కర్ర కింద పడిపోయింది. తెలివైన గాడిద హాయిగా ముందుకు కదిలింది. దాని వెనుకాల ఉన్న మిగతా గాడిదలు ఆ తెలివైన గాడిదను అనుసరించాయి.
ఈ గాడిద తెలివితేటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నది. వీడియో చూసిన నెటిజన్లు గాడిద తెలివికి ఫిదా అవుతున్నారు. మరెందుకు ఆలస్యం..? ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Work smarter.. 😅 pic.twitter.com/fFanLbhCO1
— Buitengebieden (@buitengebieden) December 10, 2023