ముంబై: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లను మార్చుతూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఔరంగాబాద్‌ను ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్చినట్లు అందులో తెలిపింది. ఈ జిల్లాల పేర్లను మార్చాలని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాఢీ ప్రభుత్వం 2022 జూన్‌లో నిర్ణయించింది. అయితే ఉద్ధవ్ మంత్రివర్గం ఔరంగాబాద్‌ను శంభాజీ నగర్‌గా మార్చాలని నిర్ణయించగా, షిండే ప్రభుత్వం దీనికి ఛత్రపతి శంభాజీ నగర్ అని పేరు పెట్టింది.