న్యూఢిల్లీ, మే 21: ఆర్టికల్ 370కి సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2023 డిసెంబరు 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సమీక్షించాలని జమ్ము కశ్మీర్‌కు చెందిన పలు రాజకీయ పార్టీలు, నేతలు, న్యాయవాదులు వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ పిటిషన్లను కొట్టేసింది.