మంగళవారం 26 జనవరి 2021
National - Dec 21, 2020 , 11:52:18

బుద్ధుడి బోధనలతో ప్రపంచ సవాళ్లను అధిగమించొచ్చు : మోదీ

బుద్ధుడి బోధనలతో ప్రపంచ సవాళ్లను అధిగమించొచ్చు : మోదీ

న్యూఢిల్లీ : గౌతమ బుద్ధుడి బోధనలతో ప్రపంచ సవాళ్లను అధిగమించవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సోమవారం భారత్‌ - జపాన్‌ సంవాద్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. వృద్ధి సరళి మానవ కేంద్రిత విధానాన్ని అనుసరించాలన్నారు. ప్రపంచ వృద్ధి చర్చలు కేవలం కొద్ది మధ్య మాత్రమే జరుగరాదని, ఈ అజెండా మరింత విస్తృతం కావాలన్నారు. ఎదుగుదల నమూనాలు మానవ కేంద్రిత విధానాన్ని అనుసరించాలన్నారు. మన పరిసరాలను సామరస్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మన ఉనికికి మూలస్తంభంగా ఉన్న ప్రకృతితో సామరస్యపూర్వక సహజీవనాన్ని మనం రూపొందించాలి’ అని అన్నారు.

సంప్రదాయ బౌద్ధ సాహిత్యం, గ్రంథాలతో లైబ్రరీ ఏర్పాటుకు ప్రతిపాదించారు. భారత్‌లోనూ ఇలాంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఈ మేరకు తగిన సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గ్రంథాలయం వివిధ దేశాల నుంచి బౌద్ధ సాహిత్యం డిజిటల్‌ కాపీలను సేకరిస్తుందని చెప్పారు. వాటిని అనువధించి బౌద్ధ సన్యాసులు, పండితులకు ఉచితంగా అందుబాటులో ఉండేలా చూడడమే లక్ష్యమన్నారు. ఈ గ్రంథాలయం కేవలం సాహిత్యానికే కాదు పరిశోధన, చర్చలకు వేదికగా ఉంటుందన్నారు. ‘సమాజాలు, మానవులు, ప్రకృతి మధ్య నిజమైన సంవాదం’ అని ఆయన పేర్కొన్నారు.logo