జైసల్మేర్: రాజస్థాన్లోని మేఘ గ్రామంలో డైనోసార్లు సంచరించినట్టు కొందరు పరిశోధకులు గుర్తించారు. దాదాపు 180 మిలియన్ సంవత్సరాల క్రితం జురాసిక్ యుగం నాటి వెన్నెముక గల జంతు జాతి శిలాజాన్ని వీరు కనుగొన్నారు. రాజస్థాన్లోని మేఘ గ్రామంలో డైనోసార్లు సంచరించినట్టు కొందరు పరిశోధకులు గుర్తించారు.
దాదాపు 180 మిలియన్ సంవత్సరాల క్రితం జురాసిక్ యుగం నాటి వెన్నెముక గల జంతు జాతి శిలాజాన్ని వీరు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ జైసల్మేర్ భౌగోళిక చరిత్రపై కొత్త వెలుగును నింపడమే కాకుండా పరిశోధన, పర్యాటక రంగాలకు కొత్త మార్గాలను తెరుస్తుందని భావిస్తున్నారు. ‘ఇది వెన్నెముక గల జంతు జాతి శిలాజం..వెన్నెముక మొత్తం భాగాలను ఇందులో చూడవచ్చు’ అని సీనియర్ హైడ్రో-జియాలజిస్ట్ నారాయణ దాస్ ఇనాఖియా తెలిపారు.