కోల్‌కతా: పశ్చిమ బెంగాల్(West Bengal) సీఎంగా ఇవాళ సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు అయిదు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. సువేందు క్యాబినెట్లో దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పౌల్, నిశిత్ ప్రమాణిక్, క్షుదిరామ్ తుడు, అశోక్ కీర్తనియా ఉన్నారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలోనే అయిదుగురు మంత్రులు ప్రమాణం చేశారు. దిలీష్ ఘోష్.. సీనియర్ బీజేపీ నేత. ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆర్ఎస్ఎస్తో అతనికి అనుబంధం ఉన్నది. ఫుల్ టైం ప్రచారం నిర్వహించారు. 2014 తర్వాత బెంగాల్లో బీజేపీ వ్యాప్తి గ్రామీణ స్థాయిలో ఆయన పనిచేశారు. గతంలో మిడ్నాపూర్ లోక్‌సభ నుంచి ఎన్నికయ్యారు.
ఇవాళ ప్రమాణం చేసిన మంత్రుల్లో ఓ మహిళ ఉన్నారు. ఆమే అగ్నిమిత్ర పౌల్. ఫ్యాషన్ డిజైనర్ నుంచి రాజకీయవేత్తగా ఎదిగారు. బీజేపీ బెంగాల్ క్యాబినెట్లో ప్రస్తుతం ఆమె ఏకైక మహిళ. 2019లో ఆమె బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆ రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలయ్యారు. 2021లో బీజేపీ జనరల్ సెక్రటరీగా ఆమె నియమితురాలయ్యారు. బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఈ ఏడాది ఆరంభంలో అగ్నిమిత్ర అపాయింట్ అయ్యారు.
ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై బీజేపీ సీనియర్ నేత మకన్లాల్ సర్కార్‌ను ప్రధాని మోదీ సన్మానించారు. 1952లో కశ్మీర్లో మకన్లాల్ను అరెస్టు చేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన్ను అరెస్టు చేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు మకన్లాల్ కశ్మీర్‌కు వెళ్లారు. మకన్లాల్ ప్రస్తుతం 98 ఏళ్లు ఉన్నారు.
#WATCH | Kolkata | PM Modi felicitates and takes blessings of Makhanlal Sarkar, one of the most senior workers of the BJP in West Bengal.
In 1952, Makhanlal Sarkar was arrested in Kashmir while accompanying Syama Prasad Mukherjee during the movement to hoist the Indian… pic.twitter.com/gpmLISKYZ5
— ANI (@ANI) May 9, 2026