ముంబై, జనవరి 19 (నమస్తే తెలంగాణ): మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్ కోసం తాము చేపడుతున్న ఉద్యమం చివరిదని, 26న చేపట్టే ఆమరణ నిరాహార దీక్షతో మరాఠాల డిమాండ్ నెరవేరాల్సిందేనని ఉద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్ స్పష్టం చేశారు. శనివారం అంతర్ వాలి గ్రామం నుంచి వేలాది మంది మరాఠాలతో కలిసి ముంబై బయలుదేరారు.
జనవరి 26న ఆజాద్ మైదానంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. మరాఠాల రిజర్వేషన్లపై సీఎం షిండే, అజిత్ పవార్, ఫడ్నవీస్ దృష్టి పెట్టాలన్నారు. మరాఠాలను మోసగించేందుకు అనుమతించనని, 54 లక్షల మందికి ఓబీసీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.